GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:27 am Digital Edition : GURU SWAMY

వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్31

బైరెడ్డిపల్లి మండలం లోని మురారిపల్లి,కడపనత్తం గ్రామాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలం లోని మురారిపల్లి లో కల శ్రీ ఓబులేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు తిప్పచార్యులు బృందంచే పంచామృత అభిషేకంచెప్పటి మూలవర్లకు ఆకర్షణీయంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసి మహామంగళహారతి చేపట్టారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే మండలం లోని కడపనత్తం గ్రామంలో వెలిసివున్న శ్రీ నల్గొండ్రాయస్వామి కి అర్చకులు రామకృష్ణమాచార్యులు చే అభిషేకం,ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.