వేంబాకంలో పారిశుద్ధ్యం పడకేసింది

ఐదు రోజులుగా తాగునీటికి తప్పని ఇబ్బందులు..! ఏళ్ల తరబడి శుభ్రం చేయని వాటర్‌ ట్యాంక్‌ ..!! తాగునీటిలో పురుగులు వస్తున్నాయని గ్రామస్తుల ఆవేదన..! పంచాయతీ అధికారుల తీరుపై విమర్శలు..? నాగలాపురం, అక్టోబర్‌ 2 గరుడధాత్రి: నాగలాపురం మండలం వేంబాకం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా మారాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లే ప్రక్రియ చేపట్టకపోవడంతోపాటు, వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించే చర్యలు కూడా కనిపించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని,...