శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారికి ఆలయంలో శనివారం సాయంత్రం ఉయ్యాల సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పాలతో అలంకరించిన ఉయ్యాలలో అధిష్ఠింపజేసి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన ఉయ్యాల సేవను భక్తులు దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.