వేదనారాయణ స్వామి కళ్యాణోత్సవానికి భక్తులకు ఆహ్వానం

నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ పవిత్ర కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి దంపతులుగా రూ.750 చెల్లించి రసీదు పొందాలని సూచించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు శ్రీనివాసులు, చెంగల్ రాయలు, ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, స్వామివారి కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దైవ అనుగ్రహం పొందాలని కోరారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించే...