వేదవల్లి తాయారుకు ఘనంగా ఉయ్యాల సేవ
నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం వేదవల్లి తాయారుకు ఘనంగా ఉయ్యాల సేవ నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా తాయారిని పుష్పాలతో అలంకరించి ఉయ్యాలలో ఆసీనురాలిగా చేసి సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.