GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 10:26 pm Digital Edition : GURU SWAMY

వేపనపల్లి గణేష్ నిమజ్జనంలో జిల్లా జనసేన నాయకులు

పూతలపట్టు సెప్టెంబర్ 20 (గరుడ దాత్రి న్యూస్) పూతలపట్టు మండలం వేపనపల్లిలో ఆదివారం జరిగిన గణేష్ నిమజ్జనంలో జిల్లా జనసేన నాయకుడు గుర్రం రఘురాం చౌదరి. ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య. సీనియర్ నాయకులు పాల్గొని గణేష్ విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు ఏపీ. శివయ్య, నెహ్రూ రాయల్, యాదమరి మండల జనసేన పార్టీ నాయకుడు బి. కుమార్, పీఏసీ డైరెక్టర్ ప్రభాకర్, చిరంజీవి జిల్లా యువజన అధ్యక్షులు పుల ప్రభాకర్, కాణిపాకం మాజీ చైర్మన్ లతా రాజ్ కుమార్, ఐరాల జనసేన పార్టీ మండల అధ్యక్షులు కె. పురుషోత్తం, తవణంపల్లి మండల ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. ఇటీవల వేపనపల్లిలో రమేష్ మృతి చెందాడు ఆయన కుటుంబానికి రఘురాం చౌదరి 10 వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గుర్రం రఘురాం చౌదరి మాట్లాడుతూ పూతలపట్టు నియోజకవర్గం లో జనసేన పార్టీ పటిష్టకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసైనికులు సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామానికి వచ్చిన జనసేన నాయకులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన శ్రీనివాసులు, రాజ్ కుమార్.యువ నాయకుడు కిరణ్, మోహన్ బాబు. మబంగారుపాళ్యం నాయకులు పవన్, అనిల్, శాంతమూర్తి, యోగరాజ్ సాయిదీప్, గోపి, చంటి, మునేంద్ర, యువరాజ్, జయప్రకాశ్.జనసైనికులకు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు