GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 6:10 am Digital Edition : GURU SWAMY

వే ఫౌండేషన్ విశిష్ట సేవా పురస్కారం అందుకున్న సేవారత్న డాక్టర్ మురుగన్

పలమనేరు, ఆగస్టు 16 ( గరుడ ధాత్రి ) :

వే ఫౌండేషన్ 13వ వార్షికోత్సవ వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, సమాజానికి విశేష సేవలు అందిస్తున్న పలువురు సేవా ప్రముఖులను ఘనంగా సత్కరించారు. పలమనేరు మున్సిపాలిటీ గంటవూరు బీసీ కాలనీ శ్రీశ్రీశ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ ధర్మకర్త చైర్మన్, సేవారత్న డాక్టర్ మురుగన్‌ను వే ఫౌండేషన్ ప్రత్యేకంగా సత్కరించింది. ఆయన చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను గుర్తించిన ఫౌండేషన్ ప్రతినిధులు “విశిష్ట సేవా పురస్కారం” అందజేసి ఘనంగా గౌరవించారు. ప్రజా సేవతో పాటు సామాజిక, ఆధ్యాత్మిక రంగాల్లో తనవంతు సహకారం అందిస్తూ ముందుకు సాగుతున్న డాక్టర్ మురుగన్ ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన 9 అవార్డులు, 7 గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. తాజాగా వే ఫౌండేషన్ నుంచి లభించిన ఈ పురస్కారం ఆయన సేవలకు మరో గుర్తింపుగా నిలిచింది.
పురస్కారం అందుకున్న అనంతరం సేవారత్న డాక్టర్ మురుగన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసేవ చేస్తున్న తనను గుర్తించి వే ఫౌండేషన్ వారు తిరుపతికి ఆహ్వానించి ఈ అవార్డును అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. “ఇప్పటివరకు ఎన్నో అవార్డులు అందుకోవడం జరిగింది. ఒక్కో అవార్డు అందుకుంటున్న కొద్దీ నాపై బాధ్యత మరింత పెరుగుతోంది. అవార్డులు కేవలం గౌరవం కోసం కాకుండా, మరింత మంది ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తిని ఇస్తున్నాయి. సమాజానికి నా వంతు సేవను మరింత విస్తృతంగా కొనసాగిస్తాను” అని డాక్టర్ మురుగన్ తెలిపారు. తన సేవలను గుర్తించి విశిష్ట సేవా పురస్కారాన్ని అందించిన వే ఫౌండేషన్ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తాను నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, నిరంతరం ప్రచారం చేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా ప్రతినిధులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న డాక్టర్ మురుగన్‌కు వరుసగా అవార్డులు, సత్కారాలు లభిస్తుండటం తాజాగా వే ఫౌండేషన్ విశిష్ట సేవా పురస్కారం అందుకోవడంతో ఆయన సేవా ప్రస్థానానికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు చేరింది.అవార్డులు తనకు వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని, అవి ప్రజల పట్ల తన బాధ్యతను మరింత పెంచుతున్నాయని డాక్టర్ మురుగన్ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతానని స్పష్టం చేశారు. ప్రజాసేవకు గుర్తింపు.. సేవా సంకల్పానికి మరింత ప్రోత్సాహం.. వే ఫౌండేషన్ పురస్కారంతో డాక్టర్ మురుగన్ సేవా ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచింది.