వే ఫౌండేషన్ విశిష్ట సేవా పురస్కారం అందుకున్న సేవారత్న డాక్టర్ మురుగన్
పలమనేరు, ఆగస్టు 16 ( గరుడ ధాత్రి ) : వే ఫౌండేషన్ 13వ వార్షికోత్సవ వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, సమాజానికి విశేష సేవలు అందిస్తున్న పలువురు సేవా ప్రముఖులను ఘనంగా సత్కరించారు. పలమనేరు మున్సిపాలిటీ గంటవూరు బీసీ కాలనీ శ్రీశ్రీశ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ ధర్మకర్త చైర్మన్, సేవారత్న డాక్టర్ మురుగన్‌ను వే ఫౌండేషన్ ప్రత్యేకంగా సత్కరించింది. ఆయన చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను గుర్తించిన ఫౌండేషన్ ప్రతినిధులు “విశిష్ట సేవా పురస్కారం”...