వైభవంగా వేదవల్లి అమ్మవారి ఊయల సేవ

నాగలాపురం: పట్టణంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం శ్రీ వేదవల్లి అమ్మవారి ఊయల సేవను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించి, తిరుచిపై అమ్మవారిని వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ ఊయల సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు సేవలో పాల్గొని తరించారు. ఊయల సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.