వైభవంగా శ్రావణమాస రెండవ శనివారం పూజలు
చౌడేపల్లి ఆగస్టు 22 గరుడ దాత్రి న్యూస్ శ్రావణ మాసం పురస్కరించుకుని స్థానిక రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ విల్లివిరిసింది. పవిత్రమైన శ్రావణ మాసంలో రెండవ శనివారం అత్యంత ప్రాశస్త్యమైన రోజు కావడంతో, శ్రీ స్వామి వారి దివ్య దర్శనం కోసం భక్తులు ఆలయానికి చేరుకున్నారు ఆలయ ప్రధానార్చకులు వశిష్టాచార్యుల పర్యవేక్షణలో వేకువజామునే సుప్రభాత సేవతో స్వామి వారి పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. స్వామి వారికి పంచామృతాభిషేకం, విశేష ధూపదీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం సర్వభూషణాంబరధారిగా...