వైభవంగా శ్రీ వేదనారాయణస్వామివారి రథోత్సవం
భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తజనం మే 9న చక్రస్నానం, ధ్వజావరోహణం -- నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం జరిగిన రథోత్సవం భక్తి పారవశ్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, భజనల నడుమ స్వామివారి రథయాత్ర గ్రామ వీధులను ఆధ్యాత్మిక కాంతులతో నింపింది. ఉదయం 6.25 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారు మహారథాన్ని అధిష్ఠించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, భజన బృందాల నృత్యాలతో ఆలయ...