వేదనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు స్వామివారిని ముత్య పందిరి వాహనములో గ్రామోత్సవంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. మాడ వీధులలో స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వాహన సేవ సమయంలో భక్తుల గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది.
ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు సమర్థంగా నిర్వహించడంతో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.