వైసిపి అరాచకానికి అమరుడైన అమర్నాథ్ గౌడ్

-బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆత్మ బంధువులైన బిసి వర్గాలకు చెందిన వారిపై కక్ష పెంచుకున్న వైసిపి అరాచకానికి చి!! అమర్‌నాథ్ గౌడ్ అమరుడయ్యాడని శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల అరాచకానికి అశువులు బాసిన అమర్నాథ్ గౌడ్ మూడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాలుడి చిత్రపటానికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ...