GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 1:49 pm Posted by : GARUDA DHATRI NEWS

వైసిపి నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకులు నాపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలి-ఎర్రం దొరబాబు నాయుడు

-టిడిపిలో నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాల కుట్రలో టిడిపి నాయకులు ఇరుక్కోవద్దు

కేవీబి పురం, జూన్ 11 మండలంలోని ప్రెస్ క్లబ్ నందు తిమ్మసముద్రం మాజీ సర్పంచ్ ఎర్రం దొరబాబు నాయుడు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో నా ఎదుగుదలను చూడలేక ఓర్వలేక నాపై వైసిపి నాయకులు మరి కొంతమంది టిడిపి నాయకులతో కలిసి నాపై బురద చల్లు తున్నారని వ్యక్తిగత అభివృద్ధిని చూడలేకనే దిగజారుడు వ్యాఖ్యలు రాయించడం నా సొంత భూమిని కూడా నాది అని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు. నేను తెలుగుదేశం పార్టీ సర్పంచిగా మండలం క్లస్టర్ ఫోర్ ఇన్చార్జిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పంచాయితీలోని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించానని తెలిపారు. ఇలాంటి అభివృద్ధి పనులు చేస్తుంటే మా గ్రామంలో కొంతమంది కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కొంతమంది వైయస్సార్సీపి నాయకులు కొంతమంది కలుసుకొని నా పైన చివరకు పత్రికల్లో వార్తలు రాయిస్తున్నారని ఇందులో అన్ని అబద్దాలని వాస్తవాలు ఏ ఒక్కటీ లేదని మాకు సంవత్సరాల తరబడి రెవెన్యూ రికార్డులలో డి నమూనాతో కూడిన భూములు కొంత ఉన్నాయని సర్వే నంబర్ 284“/3 పి, 284. /4. డి, 284/5 బి. , 284/4 ఈ సర్వే నంబర్లలో మాకు డి నమున రికార్డులతో కలిపి తొమ్మిది ఎకరాల 50 సెంట్లు భూమి కలదని ఆ భూమిపై మా గ్రామానికి సంబంధించిన వ్యక్తి ద్వారా తిరుపతి నివాసి అయిన భాస్కర్ నాయుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం మా గ్రామంలో డైరీ ఏర్పాటు చేశామన్నారు. కాబట్టి భాస్కర్ నాయుడు భార్య మంజుల ఇంకా కొంతమందితో కలిసి డైరీ లోను కని బ్యాంకుకు వెళ్ళామని ఈ సందర్భంగా తెలియజేశారు. అప్పుడు ముందు బ్యాంకు వారు ఆ భూమి అధికంగా చూపిస్తే డైరీ రుణంకు ఆవుల మేతకు వస్తుందని నమ్మకంతో భాస్కర్ నాయుడుకు జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఉన్న లావాదేవీలు మా భూమిని భాస్కర్ నాయుడుకు మంజులమ్మకు లోన్ కు మాత్రమే ఆన్లైన్లో వాళ్ళ పేర్లు ఎక్కించామే తప్ప భూమి వారి కి సంబంధం లేదని తెలిపారు. బ్యాంకులో తీసుకున్న రుణాలు అందరూ కట్టాల్సి ఉందని ఇలాంటి పరిస్థితుల్లో భాస్కర్ నాయుడు మృతి చెందాడు. దీంతో ఆయనకు అంత్యక్రియలు, కర్మకాండ క్రమాలను నేను దగ్గరుండి నిర్వహించానన్నారు. మృతి చెందిన తర్వాత ఆయన ఉండేటప్పుడు ఆమె ఏది కూడా నోరు తెరవకుండా ఉండిందని ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు టిడిపి నాయకుల తో కలిసి నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు భాస్కర్ నాయుడు మంజుల పేరు మీద బ్యాంకు లోన్ కోసం కొంత భూమిని వారి పైన చేర్చడంతో ఇప్పుడు ఆమె నా పేరు ఉంది కాబట్టి ఆ భూమి నాది అని ఆమె మాపై వైఎస్ఆర్సిపి నాయకులు గిట్టని వారు ఆమెను ఉసిగొలిపి నా పైకి బురదలు చెల్లె కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. నా అభివృద్ధి ఎదుగుదలను చూసి ఓర్వ లేకుండా వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశం లో చేరి ఉన్న ఆ నాయకులు కొంతమంది టిడిపి నాయకులకు కలిసి ఈ విధంగా నాపై కక్ష సాధిస్తున్నారని తెలిపారు. ఆన్లైన్లో ఎక్కించిన అంత మాత్రం నా భూమి వాళ్ళకి ఎట్లా చెందుతుందని డీ నమూనా రెవెన్యూ కార్యాలయంలో భూమి రికార్డులు మాపై ఉందని డైరీ ఫారం లోన్ తీసు కొన్న లోను ఇంకా బ్యాంకులో అప్పులు తీర్చలేదని దీనికి భాస్కర్ నాయుడు నేను మంజులమ్మ కూడా అప్పు ఉన్నా మనీ సుమారు పది లక్షల రూపాయలు ఆమె చెల్లించాల్సి ఉందని అన్ని అప్పులు తీరిపోతే ఆ భూమిపై భాస్కర్ నాయుడుకు మంజులమ్మకు ఉన్న ఆన్లైన్లో తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆన్లైన్లో ఉన్నంత మాత్రాన భూమి ఎలా వారిది అవుతుందని ఆయన తెలిపారు. నా అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఇలా చేస్తున్నారని ఎర్రం దొరబాబు నాయుడు ఆరోపించారు. ఇందులో రెవెన్యూ అధికారుల తప్పేమీ లేదని అధికారులు అన్నీ పత్రాలు పరిశీలించి మాకు న్యాయం చేశారని ఆయన అన్నారు. నేను ప్రజల మనిషినని ప్రజా సంక్షేమాలు చేస్తున్నానని నేను ఆ పార్టీ ఈ పార్టీ నుండి రాలేదని నేను హంతకుడిని కాదు అని నేను ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రం వరకు భూకబ్జాలు చేసే వ్యక్తిని కాదని నేను ప్రజల మనిషినని పక్కా టిడిపి నాయకుడిని తన ఆవేదనను వ్యక్తపరిచారు.