వైసీపీకి షాక్.. కాంగ్రెస్ లో చేరిన యువనేత జోగి వినోద్
సూళ్లూరుపేట, సెప్టెంబర్ 4 గరుడధాత్రి : సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కోటపోలూరు గ్రామానికి చెందిన వైసీపీ యువ నాయకుడు జోగి వినోద్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురువం బాబు మరియు సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డి. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో.. ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.అనంతరం జోగి వినోద్ కు తిరుపతి జిల్లా రైతు...