GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 7:57 pm Posted by : GARUDA DHATRI NEWS

వ్యక్తిత్వ వికాస శిక్షణతో ఉజ్వల భవిష్యత్తు

విశాఖ కేంద్ర గ్రంథాలయంలో
బాల బాలికలకు
వ్యక్తిత్వ వికాస ప్రక్రియతో ఉన్నతమైన భవిష్యత్తు

-ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వన్నెంరెడ్డి సతీష్ కుమార్

గరుడధాత్రి న్యూస్ :

వ్యక్తిత్వ వికాస ప్రక్రియ తో భవిష్యత్తు ఉన్నతంగా తీర్చుకోగలరని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వన్నెంరెడ్డి సతీష్ కుమార్ అన్నారు.విశాఖపట్నం జిల్లా కేంద్ర గ్రంథాలయం లో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం ను ఆదివారం సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక వ్యక్తిత్వ వికాస నిపుణులు విద్యార్థులకు ప్రత్యేక మెలకువలు నేర్పించారు
చదువుతో పాటు కొన్ని ప్రత్యేకతలు శ్రద్ధలు పై అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఈ శిబిరం లో పాల్గొన్న ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు పన్నెంరెడ్డి సతీష్ కుమార్ విద్యార్థులు ఈ శిబిరంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాబోవు రోజుల్లో మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని అందుకు అనుగుణంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరై సహకరించాలని కోరారు. జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు భారతమాత కవిత చదివి ఉత్సాహ పరిచారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ ఎన్ వి నరసింహం సిబ్బంది పాఠకులు పాల్గొన్నారు. అనంతరం ఫలహారంలు శీతల పానీయాలు పంపిణీ చేశారు.