GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 6:00 am Digital Edition : GURU SWAMY

వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఎన్నిక

వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఎన్నిక

నాగలాపురం, ఏప్రిల్ 30, (గరుడధాత్రి న్యూస్)

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాగలాపురం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ తెలిపారు. గురువారం మండల కేంద్రమైన నాగలాపురం పంచాయతీలోని సుందరయ్య కాలనీలో వ్యవసాయ కార్మికులతో మండల కమిటీ సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా దాసరి జనార్ధన్ మాట్లాడుతూ నాగలాపురం మండల అధ్యక్షురాలుగా పి ప్రమీల, ఉపాధ్యక్షులుగా ఎస్ గౌరీ, కార్యదర్శిగా ఆర్ మురుగేష్, సహాయ కార్యదర్శిగా అశ్విని, అమ్ముదా, కార్యవర్గ సభ్యులుగా సుబ్బమ్మ, దినమణి, పద్మ దక్షిణామూర్తి , పయనమ్మ, బాలాజీ, మునుస్వామి మేనక, అమృత, సంగీత నవీనలు ఎన్నికైనట్లు తెలిపారు. మండలంలో పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై పనిచేసి ఎక్కువ గ్రామాలకు విస్తరించాలని సూచించారు .భూ సమస్యలు, ఇళ్ల స్థలాలు ఉపాధి హామీ సమస్యలపై నిరంతరం పనిచేయాలని నూతన కమిటీని కోరారు. మే నెల రెండవ తేదీన సత్యవేడులో జరిగే జిల్లా మహాసభలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.