శంకర్ రెడ్డి చేరాళ్లకుప్పంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
సత్యవేడు గరుడధాత్రి న్యూస్ : సత్యవేడు నియోజకవర్గంలోని రాళ్లకుప్పం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి స్థానిక మండల నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేసి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి పారదర్శకంగా చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం మరింత మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ...