శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు
భక్తి పారవశ్యంలో రెండో రోజు ఉత్సవాలు ఆదివారం గరుడ వాహనం సేవ రాత్రి 7 గం.లకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు రెండవ రోజైన శనివారం భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దివ్యానుభూతిని కలిగించాయి. వైభవంగా స్నపన తిరుమంజనం ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి 11 గంటల వరకు కల్యాణ మండపంలో ఉత్సవమూర్తులకు పాలు,...