GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 7:41 pm Digital Edition : GURU SWAMY

శిల్పారామంలో కనువిందు చేసిన నృత్య ప్రదర్శనలు

తిరుచానూరు, ఆగస్టు 02 (గరుడధాత్రి న్యూస్) తిరుచానూరు శిల్పారామంలో వారాంతపు కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం తిరుపతికి చెందిన ‘శ్రీ పద్మ కళాక్షేత్రం డాన్స్ అకాడమీ వారిచే గురువు, నాట్య కళా సరస్వతి శ్రీమతి శ్రీదేవి బాలాజీ ఆధ్వర్యంలో నృత్యం నర్తించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఇందులో అంశాలు మూషిక వాహన ‘అదిగో అల్లదిగో శ్రీహరి వాసము, ముద్దుగారే యశోద,ఓం నమశ్శివాయ, కొలువై ఉన్నాడే చూడు గోవిందుడు, అయిగిరి నందిని,నటేష కౌతం, పుష్పాంజలి, వంటి అంశాలకు కళాకారులుగా లేక్షణ, హర్షిత, నిఖిత, ప్రీతి సాయి, సాయి సుహాని, లాస్య, తేజస్విని, హేమశ్రీ, అవిగ్న, రాహిణి, మనీషా, పాయల్, నోహిత్, మానస్వి, భవ్యశ్రీ, శ్రేయశ్రీ, ముస్మశ్రీ, లక్షణ, ఖుషి కృష్ణ, నిత్య, మమత, హనిషా, గ్రీషా, మేఘా, సింధు, భావిగ్న, గీతాశ్రీ, సహస్ర, తీర్థశ్రీ, పార్థనేహ, గగన శ్రీహిత,యశ్వంతిక తదితర విద్యార్థులు పాల్గొని తమ నృత్య కౌశలాన్ని చూపరులను ఆకట్టుకునే విధంగా చూడ చక్కని హావభావలతో నుత్యం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు శిల్పారామం పరిపాలన అధికారి ఖాదర్ వలి, శిల్పారామం సిబ్బంది తీపి జ్ఞాపకాలను అందజేశారు.