GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 6:56 am Digital Edition : GURU SWAMY

శివాలయంలో అన్నదాన కార్యక్రమం

కార్వేటినగరం ఆగస్టు 17 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం చెరువు కట్టకు అనుకొని సుద్ధగుంట గ్రామం సమీపమున వెలసియుండు శ్రీశ్రీశ్రీ.శిష్ట సౌందర్యవల్లి సమేత సదాశివేశ్వర స్వామి సన్నిధిలో సోమవారం ఉదయం ఆలయంలో సదాశివేశ్వర స్వామి వారికి అభిషేకం పూజ కార్యక్రమం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిపింపబడినది.ఆలయం దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమాలలో ఆలయ కమిటీ కార్యదర్శి రాజేంద్రరెడ్డి, సుబ్బరాయల్ యాదవ్, మునస్వామి, లోక రాజు, నాగయ్య పండబ్బ, భక్తి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.