•వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నల్లబెలూన్స్ ఎగురవేసి నిరసనలు.
•నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కుమార్తె మరియు వైఎస్ఆర్సిపి శ్రేణులు .
శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన మరియు ముఖాముఖి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె కాటంరెడ్డి శ్రీ పవిత్ర రెడ్డి బియ్యపు గారు,వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.
ముందుగా చంద్రబాబు రెండేళ్ల పాలనకు నిరసన తెలిపి నల్ల బెలూన్లు ఎగురవేసిన పవిత్ర రెడ్డి మరియు వైఎస్ఆర్సిపి శ్రేణులు.
అలాగే ఈ రెండేళ్ల లో తెలుగుదేశం పార్టీ చేసిన దాడులను మరియు గతంలో జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వీక్షించారు.
ఈ సందర్భంగా పవిత్ర రెడ్డి గారు మాట్లాడుతూ,చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం ద్వారా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుకు తీసుకువస్తున్నాం అన్నారు. ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారం కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది అని అన్నారు.యువతకు ఉద్యోగాలు, మహిళలకు సంక్షేమం, రైతులకు భరోసా, పేదలకు అభివృద్ధి అనే పేరుతో ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఎంతవరకు అమలయ్యాయో ప్రజలే పరిశీలించాలి. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రతిపక్షంగా మా బాధ్యత. ప్రజల తరఫున నిలబడి వారి గొంతుకగా పనిచేయడం మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము.గతంలో 2019లో నాన్న ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు కాకుండా శ్రీకాళహస్తిలో నాన్నగారు తన సొంత పథకాలను ప్రవేశపెట్టారు. అందులో నిరుపేదలు ఎవరు చనిపోయిన వారి అంతిమ సంస్కారాలకు పదివేల రూపాయలను ఆర్థిక సహాయం చేశారు. నిరుపేద హిందువుల పెళ్లిళ్లకు బంగారు తాళిబొట్లు పట్టు వస్త్రాలు ఉచితంగా అందజేశారు. నిరుపేద ముస్లిం పెళ్లి కుమార్తెకు మేనమామ సాంగ్యం కింద డబుల్ కాట్ మంచము ఫ్రిడ్జ్ బీరువా మొదలైనవి అందజేశారు.అలాగే రోడ్డు పక్కన వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారస్తులకు ఉచితంగా తోపుడుబండ్లను అందజేశారు. నేడు మనం ఇచ్చిన తోపుడు పనులకు రంగులు మార్చి ఏదో వాళ్ళు ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చుకుంటున్నారు అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆటోలు, వికలాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్, అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గం లో చదువుకుంటున్న పిల్లలకు ఫీజు కట్టలేని వారికి నారాయణ శ్రీ చైతన్య వంటి కళాశాలలో ఉచితంగా చదివించారు.ఇంత మంచి చేసిన మనకి రేపు కచ్చితంగా దేవుడు మంచే చేస్తారు.గతంలో మనం గెలిచినప్పుడు ఎందరో మన పార్టీలోకి వచ్చి సంపాదించుకొని మరల వాళ్ల సొంత తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు.ఆ సమయంలో మనం వారి నాటకాన్ని గ్రహించలేకపోయాము కానీ ఈసారి అలా జరిగే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఎవరెవరు కష్టపడుతున్నారో నాన్న ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటున్నారు. రేపు అధికారంలోకి మనం కచ్చితంగా వస్తున్నాము మనం అధికారంలోకి రాగానే నేడు మనకు కష్టకాలంలో తోడుగా మనతోపాటు ఉన్న వాళ్లందరి జీవితాలు మారబోతున్నాయి.మీ అందరి జీవితాలకు నాన్నగారు భరోసాగా ఉంటారు.శ్రీకాళహస్తిలో నిరుపేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలలో కట్టుకున్న ఇళ్లను కూడా కూల్చివేశారు. శ్రీకాళహస్తి నాలుగు మాడవీధులలో బ్యానర్లు ఉండకూడదని చెప్పిన కూటమి బ్యానర్లు కనిపిస్తున్నాయి. మీరు ఈరోజు పోయి చూసినా కూడా 4 వీధుల్లో ఎవరు బ్యానర్లు ఉన్నాయో చూడవచ్చు. చివరికి నాలుగు మడ వీధుల్లో స్వామి అమ్మవార్లలో రథం తిరగడానికి ఇబ్బందిగా ఉందని అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చింది మా నాన్న. ఆ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లకు కూడా కూటమి పోస్టర్లను అతికించేశారు. గతంలో నాన్నగారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శివరాత్రి ఎలా జరిగిందో మీ అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు శివరాత్రి ఎలా చేస్తున్నారో నేను చెప్పనక్కర్లేదు. అలాగే సామాన్య ప్రజలకు నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. డీజిల్ పెట్రోల్ రేట్లు చొప్పనక్కర్లేదు. నేడు డీజిల్ పెట్రోల్ ధరలు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అని చెప్తున్నా మేధావులు నాడు అదే పెట్రోల్ బంకుల వద్ద వెళ్లి సెల్ఫీ దిగి జగనన్న మీద అబద్ధపు ఆరోపణలు చేశారు.నాడు మీకు తెలియలేదా అవి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుందని.గతంలో ప్రతినెల జగనన్న సంక్షేమ పథకాలు ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలు నేడు ఒక్క సంక్షేమం కూడా అందకుండా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజలందరూ బాగుండాలి మా అక్క చెల్లెలు అందరూ బాగుండాలని జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇచ్చిన మాటను తప్పకుండా అమలు చేసిన మంచి మనసున్న మనిషినీ ఓడించామని ప్రజలందరూ బాధపడుతున్నారు. 2027 లో జగనన్న ప్రాథయాత్ర ప్రారంభం అవ్వగానే ప్రజలందరూ స్వచ్ఛందంగా జగనన్నకు ఎలా బ్రహ్మరథం పడతారో మీరందరూ చూస్తారు.మరలా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.అలాగే ఈ నెల 12 తేదీన జరగబోయే చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంనకు నిరసనగా నియోజకవర్గం స్థాయిలో జరగనున్న ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు.
అలాగే నిన్నటిదినం విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరణించిన కార్మికుల ఆత్మ శాంతి చేకూరాలని ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అలాగే గతంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వారి కుటుంబం పెద్దగా జగనన్న చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయలు అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కార్మికుల కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలియజేస్తున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు,జడ్పిటిసి సంధ్యా,కొగిలి సుబ్రహ్మణ్యం,కిషోర్ రెడ్డి,గంగారి రమేష్,సిరాజ్ బాషా,ఉత్తరాజి శరవణ కుమార్, కోవి చంద్రయ్యః నాయుడు,కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డి,వయ్యాల మనోహర్ రెడ్డి,పఠాన్ ఫరీద్,గోరా,మున్నా రాయల్,బుల్లెట్ జై శ్యామ్ రాయల్, పంతులు,కోలూరు హరి నాయుడు,ప్రభాకర్,పులి రామచంద్ర, ఫజల్, శివకుమార్ యాదవ్, ముని కృష్ణారెడ్డి, సునీల్,ఆరిఫ్, ఎక్స్ కౌన్సిలర్ మహబూబ్ బాషా, ఎక్స్ కౌన్సిలర్ నాగరాజ్, లక్కమనేని కృష్ణ,గపూర్,కామి మనోహర్, భాస్కర్, శ్రీరాములు రెడ్డి, గిరిధర్ రెడ్డి గంగాధరం, తూకివాక ముని, యోగేశ్వర్ రెడ్డి, గిరి ,షబ్బీర్, ఖాదర్, పర్వీన్, గుర్నాథ్ రెడ్డి ,అమర్నాథ్ రెడ్డి, వెంకటేశ్వర నాయుడు, మొద్దుమూడి రవి, రాజారెడ్డి,భాస్కర్ రెడ్డి,మోహన్ రెడ్డి, గురవారెడ్డి జనార్ధన్, సుమతమ్మ, సాగర్ బి, షర్మిల ఠాగూర్, ముని లక్ష్మి, మాధవి, రాజేశ్వరి, భారతి, శంకర్, గుణ, అస్లాం, కొట్టే శరవణ, బాలిశెట్టి శేఖర్, అట్ల రమేష్, జూమ్లేష, ఖాదర్ బాషా, గౌస్ బాషా,జిలాని, జీవికే రెడ్డి, కుమార్, ప్రసాద్ మేస్త్రి ,సతీష్, సురేష్, సూర్య,శివ,యాకూబ్, వహీద్, దివ్య, సుబ్రహ్మణ్యం నాయుడు, అల్లయ్య, చింతా రాజేంద్ర, భాస్కర్ రెడ్డి, వెంకీ, గంగి రెడ్డి,వెంకటయ్య, అలంకారయ్య, సుబ్రమణ్యం యాదవ్ ,రాజు ప్రకాష్, దామునాయుడు, కృష్ణమూర్తి,రమేష్, హరిప్రసాద్, సుబ్రహ్మణ్యం ,వీరభద్రయ్య, జయప్రకాష్, ముద్దుమూడి గురవయ్య, నారాయణ, రామచంద్ర రెడ్డి, సుందర రామయ్య, సుధాకర్ రెడ్డి, ప్రభు ,ప్రభాకర్ రెడ్డి, రవి ,శేఖర్ రెడ్డి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs) రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులు మరియు వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.