GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 6:33 am Posted by : GURU SWAMY

శ్రీకాళహస్తి ఏపీజీబీ బ్రాంచ్ ఆధ్వర్యంలో ప్రమాద బీమా క్లెయిమ్ పరిష్కారం

– బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు పంపిణీ
​శ్రీకాళహస్తి, జూన్ 15:
ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు (APGB) శ్రీకాళహస్తి శాఖ ఆధ్వర్యంలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను విజయవంతంగా పరిష్కరించి, బాధిత కుటుంబానికి రూ. 5,00,000/- విలువైన చెక్కును అందజేశారు. కమ్మకొత్తూరు గ్రామానికి చెందిన గుడ్లూరు నరేంద్ర ఏపీజీబీ బ్యాంకులో వ్యక్తిగత ప్రమాద బీమా పథకానికి ఎన్రోల్ చేసుకోగా, ఇటీవల జరిగిన ఒక దురదృష్టకర ప్రమాదంలో ఆయన మరణించారు. దీంతో బ్యాంకు మరియు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు క్లెయిమ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, మృతుని నామినీ గుడ్లూరు సుమలతకు రూ. 5 లక్షల బీమా పరిహార చెక్కును ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ యన్. కామేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ చెక్కు పంపిణీ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ యన్. కామేశ్వరరావుతో పాటు ఆర్వో స్టాఫ్ యం. శివకుమార్, హజరత్, స్థానిక బ్రాంచ్ మేనేజర్ యం. వి. రమణయ్య, కేర్ హెల్త్ ఆఫీసర్స్ యం. లోకేశ్వర, యం. రవి మరియు స్థానిక బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.