శ్రీకాళహస్తి ఏపీజీబీ బ్రాంచ్ ఆధ్వర్యంలో ప్రమాద బీమా క్లెయిమ్ పరిష్కారం

- బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు పంపిణీ ​శ్రీకాళహస్తి, జూన్ 15: ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు (APGB) శ్రీకాళహస్తి శాఖ ఆధ్వర్యంలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను విజయవంతంగా పరిష్కరించి, బాధిత కుటుంబానికి రూ. 5,00,000/- విలువైన చెక్కును అందజేశారు. కమ్మకొత్తూరు గ్రామానికి చెందిన గుడ్లూరు నరేంద్ర ఏపీజీబీ బ్యాంకులో వ్యక్తిగత ప్రమాద బీమా పథకానికి ఎన్రోల్ చేసుకోగా, ఇటీవల జరిగిన ఒక దురదృష్టకర ప్రమాదంలో ఆయన మరణించారు. దీంతో బ్యాంకు మరియు ఇన్సూరెన్స్...