శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
పలమనేరు, ఆగస్టు 17 (గరుడ ధాత్రి ) : స్థానిక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ సోమవారం మరియు నాగ పంచమి సందర్బంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలను అర్చకులు కుమార్, చంద్రమౌళి శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పూలతో స్వామి వారిని అలంకరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఆలయ చైర్మన్ మురళీకృష్ణ, వైస్ చైర్మన్ మంజునాథ్, సభ్యులు ఎంటిఆర్ ప్రసాద్, రెడ్డప్ప, బాబు,...