GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 12:47 pm Digital Edition : GURU SWAMY

శ్రీనివాస కల్యాణ మహోత్సవానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

* కుప్పం డిపో మేనేజర్ ఆర్. రవి.
కుప్పం, అక్టోబర్ 02(గరుడ ధాత్రి న్యూస్): కుప్పం పురపాలక పరిధిలోని పరమసముద్రం వద్ద నెలకొని ఉన్న బేటరాయ స్వామి కొండ వద్ద నిర్వహించే శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని కుప్పం నుంచి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కుప్పం డిపో మేనేజర్ ఆర్.రవి తెలిపారు. శనివారం ఉదయం నుంచి
కుప్పం పట్టణంతో పాటు పరిసర గ్రామాలు, ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మహోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారి ప్రయాణ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీనివాస కల్యాణ మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.
భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు సమయానుకూలమైన ప్రయాణ సౌకర్యం అందించేందుకు ఆర్టీసీ కుప్పం డిపో సిబ్బంది అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.