శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణ వేగం పెంచాలి
నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జేఈవో డా. ఎ. శరత్ ఆదేశాలు -నాణ్యత, పనుల వేగంపై ప్రతి వారం సమీక్షలు తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని టిటిడి జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు బుధవారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆయన నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించారు. ఈ సందర్భంగా జేఈవో...