శ్రీవారిఖ పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
తిరుమల,సెప్టెంబర్ 15 గరుడధాత్రి : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన మంగళవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా గౌ|| ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయ స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు, టీటీడీ కార్య నిర్వహణాధికారి ముద్దాడ రవికుమార్,...