GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 7:43 pm Posted by : GURU SWAMY

శ్రీవారి ఆశీస్సులతో నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలి

*శ్రీవారి ఆశీస్సులతో నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలి*

*యానాదివెట్టు శ్రీవారి గుడి కుంభాభిషేకంలో ఎమ్మెల్యే ఆదిమూలం*

*బీఎస్ఎన్ఎల్ టెక్నీషియన్ అన్నాదురై కి ఎమ్మెల్యే సన్మానం*

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సత్యవేడు నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆకాంక్షించారు.

గురువారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వరదయ్యపాలెం మండలం యానాదివెట్టు లో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కుంభాభిషేక వేడుకల్లో పాల్గొని స్వామి వారి సేవలో తరించారు.

ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆదిమూలం కు ఆలయ నిర్వాహకులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం మంత్రాజలం తో ఉన్న కలశం ను ఎమ్మెల్యే తలపై ఉంచి ఆలయ ప్రదక్షణ చేసి సాంప్రదాయ బద్దంగా గర్భ గుడి గోపురంపై మంత్రజలంలో అభిషేకించి వేద పండితుల మంత్రోత్సరణాలు, మంగళ వాయిద్యాలు నడుమ శాస్త్రోక్తంగా కుంభాభిషేకం క్రతువుని పూర్తి చేశారు.

తదుపరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం మూల విరాట్ ను ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చివరగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలుకగా, నిర్వాహాలుకు ఆలయ మర్యాదలు చేసి ఎమ్మెల్యే ను ఘనంగా సత్కరించారు.

*బీఎస్ఎన్ఎల్ టెక్నీషియన్ అన్నాదురై కి ఎమ్మెల్యే సన్మానం*

నాగలాపురం బీఎస్ఎన్ఎల్ టెక్నీషియన్ అన్నాదురై గురువారం పదవీ విరమణ పొందారు.

నాగలాపురం లో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని అన్నాదురై కు శాలువ, గజ మాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.