శ్రీవారి ఆశీస్సులతో నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలి
*శ్రీవారి ఆశీస్సులతో నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలి* *యానాదివెట్టు శ్రీవారి గుడి కుంభాభిషేకంలో ఎమ్మెల్యే ఆదిమూలం* *బీఎస్ఎన్ఎల్ టెక్నీషియన్ అన్నాదురై కి ఎమ్మెల్యే సన్మానం* శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సత్యవేడు నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆకాంక్షించారు. గురువారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వరదయ్యపాలెం మండలం యానాదివెట్టు లో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కుంభాభిషేక వేడుకల్లో పాల్గొని స్వామి వారి సేవలో తరించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆదిమూలం కు ఆలయ నిర్వాహకులు, గ్రామ ప్రజలు...