శ్రీవారి భక్తసేవకు వచ్చే వైద్య సేవ నిపుణుల వసతి సౌకర్యాలపై జేఈవో డా.ఎ.శరత్ పరిశీలన

సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం శ్రీవారి భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రానున్న శ్రీవారి వైద్య సేవ నిపుణుల కోసం కేటాయించిన అతిథి గృహాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం సంబంధిత అధికారులతో కలిసి వసతి కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ నెల 17వ తేదీన తొలి విడత వైద్య నిపుణులు రానున్న నేపథ్యంలో వశిష్ఠ అతిథి గృహం, ఆయుర్వేద కళాశాల అతిథి...