శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల, 2026 జూన్ 12:: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ ఆహ్వానించగా, అర్చకులు సాంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగ నాయకులు మండపం వద్ద ఆమెకు పండితులు వేదాశీర్వచనం అందించగా ఈవో, అదనపు ఈవో తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ...