GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 9:28 pm Posted by : GARUDA DHATRI NEWS

శ్రీవేదనారాయణస్వామి ఆలయంలో పుష్పయాగ మహోత్సవానికి భక్తులకు ఆహ్వానం

🛕 పుష్పయాగ మహోత్సవానికి భక్తులందరికీ ఆహ్వానం

🛕 స్వామివారి సేవలో పుష్పాలు సమర్పించవచ్చు: ఆలయ ప్రధాన అర్చకులు

🛕నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో శుక్రవారం అత్యంత వైభవంగా పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

🛕పుష్పయాగ మహోత్సవం నిమిత్తం భక్తులు తమ వంతుగా అన్ని రకాల పుష్పాలను సమర్పించవచ్చని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. భక్తులు అందించే పుష్పాలు స్వామివారి పుష్పయాగ సేవలో వినియోగించబడతాయని పేర్కొన్నారు. ఈ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు. పుష్పయాగం ద్వారా లోకక్షేమం, శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారని తెలిపారు.