శ్రీసిటీలో క్యారియర్‌ ఏసీ కంపెనీకి లోకేష్ శంకుస్థాపన

ప్రపంచ ప్రఖ్యాత క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ & రెఫ్రిజిరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో నూతన తయారీ కేంద్ర నిర్మాణాన్ని బుధవారం ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశంలో క్యారియర్‌కు తొలి తయారీ యూనిట్‌ కానుంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, మానవ వనరుల శాఖ నారా లోకేష్ ముఖ్య అతిధిగా ఈ కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్యారియర్ గ్లోబల్ యాజమాన్య ప్రతినిధులు డేవిడ్ ఎల్...