శ్రీసిటీలో ముగిసిన వేసవి శిబిరం
- విజ్ఞానంతో పాటు వినోదం, ఆహ్లాదాన్ని పొందామన్న విద్యార్థులు శ్రీసిటీ, మే 29,గరుడధాత్రి: శ్రీసిటీ వేసవి శిబిరం (సమ్మర్ క్యాంపు) తమకు విజ్ఞానం, వివిధ అంశాలలో నైపుణ్య శిక్షణతో పాటు వినోదం, ఆహ్లాదాన్ని పంచిందంటూ విద్యార్థులు పేర్కొన్నారు. గత నెల 27న ఇరుగుళం జడ్పీ హైస్కూల్ లో ప్రారంభమైన వేసవి శిబిరం శుక్రవారంతో ముగిసింది. స్థానిక అకార్డ్ స్కూల్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ముగింపు కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవి శిబిరం పట్ల విద్యార్థులు తమ అభిప్రాయాలను, మధురానుభూతులను పంచుకున్నారు....