శ్రీసిటీలో వేడుకగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
శ్రీసిటీ, జూన్ 21, 2026 గరుడధాత్రి : శ్రీసిటీలో ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత వేడుకగా, ఉత్సాహంగా నిర్వహించారు. శ్రీసిటీ జనరల్ మేనేజర్ సన్యాసిరావు ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు స్థానిక విజిటర్స్ సెంటర్ ఆవరణలో జరిగిన యోగా కార్యక్రమంలో శ్రీసిటీ మరియు వివిధ పరిశ్రమల ప్రతినిధులు, పోలీసు శాఖ, సెజ్ డెవలప్మెంట్ కార్యాలయ సిబ్బంది, చిన్మయ, అకార్డ్ స్కూళ్ల విద్యార్థులు, స్థానికులు 180 మందికి పైగా పాల్గొన్నారు. "ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా" థీమ్‌గా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా...