శ్రీసిటీలో సీఐఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం

గరుడధాత్రి : శ్రీసిటీలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ రెండో సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల సుస్థిరత, మార్కెట్ అవకాశాలు, పరస్పర సహకారం వంటి అంశాలపై పారిశ్రామికవేత్తలు చర్చించారు. స్వర్ణ ఆంధ్ర పి4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సి. కుటుంబరావు ముఖ్య అతిథిగా పాల్గొని “భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పరిశ్రమలపై చూపుతున్న ప్రభావం – వాటిని ఎదుర్కొనే వ్యూహాలు” అనే అంశంపై ప్రసంగించారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమలు వినూత్నత, అనుకూలత, ముందుచూపుతో...