శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
సత్యవేడు జూలై 02 గరుడధాత్రి : శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ని శ్రీసిటీలోని తాత్కాలిక క్యాంపస్‌లో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్స్, రియల్ టైం గవర్నెన్స్ మంత్రి నారాలోకేష్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐయు గ్లోబల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు, పాలకమండలి ప్రతినిధులు, పరిశ్రమ భాగస్వాములు పాల్గొన్నారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మంత్రి, అతిధులకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మన యువతకు అపారమైన సామర్థ్యం, ఆశయాలు ఉన్నాయని, వారికి అవసరమైనదల్లా ఉపాధి...