శ్రీసిటీ వద్ద అగ్నిప్రమాదం.. దగ్ధమైన సిబ్బంది బస్సు
-తప్పిన పెను ప్రమాదం గరుడధాత్రి : తిరుపతి జిల్లా తడ సమీపంలోని శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద శనివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీసిటీలోని 'ఇండియా మెటల్ వన్ స్టీల్ ప్లేట్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థలో విధులు నిర్వహించే సిబ్బందిని తరలిస్తున్న ఎస్‌బిఎల్‌టి ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఉదయం సుమారు 07:50 గంటల సమయంలో జాతీయ రహదారి పక్కన బస్సు వెళ్తుండగా, ఇంజిన్ భాగం నుంచి ఒక్కసారిగా పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే...