GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 8:04 pm Digital Edition : GURU SWAMY

శ్రీసుబ్రమణ్య స్వామి ఆలయంలో రూ14, 28, 382 ఆదాయం

కార్వేటి నగరం ఆగస్టు 9 (గరుడ దాత్రి న్యూస్):

కార్వేటి నగరం మేజర్ పంచాయతీ కుమారగిరిపై వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడి కృత్తిక సందర్భంగా ఉదయం ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి ద్వజావ అవరోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఆలయానికి కంచి మఠం చెందిన విద్యార్థిని విద్యార్థులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆదాయం రూ 14,28,382 ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు రామిశెట్టి రాజశేఖర్, ఈవో కృష్ణ నాయక్ తెలిపారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కా వడీ టికెట్లు వల్ల 3,98,600, ప్రత్యేక దర్శనం 1,36,300, అర్చన టికెట్లు ద్వారా77,050, తల నీలాలు ద్వారా 57,080, విరాళాలు 62,577, తాత్కాలిక హుండి ద్వారా 3,31,781, శాశ్వత హుండీ ద్వారా 1,16,840, తలనీలాలు 2,16,000, స్వామివారి కల్యాణోత్సవం 32,154, మొత్తం 14,28,382, వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గోవిందస్వామి, ఎర్రగోటి రాధాకృష్ణ యాదవ్, వినయ్, తులసి, అమరావతి, సెల్వి వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించు కోవడం విశేషం. ఆలయం దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.