GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 7:32 am Digital Edition : GURU SWAMY

శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆడి అమావాస్య పూజ

బంగారుపాలెం ఆగస్టు 12 (గరుడ ధాత్రి న్యూస్)

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మడుపోలూరు గ్రామ సమీపంలో ఘనంగా వాసంతాపురంలో వెలసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆడి అమావాస్య పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది
వాసంతాపురం గ్రామంలో అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చన, హారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ధర్మకర్త శివాజీ అన్నదాన కార్యక్రమంలో పలమనేరు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల చైతన్య జనసేన మోహన్ రాయల్ పాల్గొనడం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు