శ్రీ ఓబులేశ్వరస్వామి, శ్రీ నల్గొండరాయస్వామి ఆలయాల్లో కొనసాగిన శనివారోత్సవాలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్13 బైరెడ్డిపల్లి మండలం లోని మురారిపల్లిలో వెలసిన శ్రీ ఓబులేశ్వరస్వామి ఆలయంలో శనివారం శనివారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి మూలవర్లకు అర్చకులు తిప్పచార్యులు బృందం పంచామృత అభిషేకం చేపట్టారు.అనంతరం స్వామి,ఉభయదేవేర్లు కు విశేష అలంకారం చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉభయదార్లు, భక్తులు పాల్గొన్నారు. అలాగే మండలం లోని కడపనత్తంలో వెలిసివున్న పురాతన శ్రీ నల్గొండరాయస్వామి ఆలయంలో అర్చకులు రామకృష్ణమాచార్యులు చే పంచామృత అభిషేకం,విశేష పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.