శ్రీ కాలభైరవేశ్వరస్వామి ఆలయ కుంభాభిషేకం లో పాల్గొన్న జడ్.పి.చైర్మన్, ఎం.పి.పి
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై27 బైరెడ్డిపల్లి మండలంలోని తీర్థం-కోట్రేపల్లి మధ్య వెలిసివున్న శ్రీ కాలభైరవేశ్వరస్వామి ఆలయంలో సోమవారం జరిగిన కుంభాభిషేకం కార్యక్రమంలో జడ్.పి.చైర్మన్ శ్రీనివాసులు అలియాస్ వాసు ,బైరెడ్డిపల్లి ఎం.పి.పి.మొగసాల రెడెప్ప పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారిని ఆలయ నిర్వాహకులు సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక, మండలవైకాపా నాయకులు పాల్గొన్నారు.