శ్రీ గోవిందరాజస్వామి వారికి అమూల్య నగల కానుక

శ్రీ గోవిందరాజస్వామి వారికి శ్రీవారి అమూల్య నగల కానుక గరుడధాత్రి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించనున్న గరుడసేవ మహోత్సవం అపూర్వ ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకోనుంది. ఈ పవిత్ర సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి తరఫున తన అన్నగారైన శ్రీ గోవిందరాజస్వామివారికి సుమారు రూ.71 లక్షల విలువైన నాలుగు దివ్య ఆభరణాలను టిటిడి భక్తి పూర్వకంగా సమర్పించింది. ఈ దివ్య కానుకల్లో సాధారణ రాళ్లు కలిగిన బంగారు గుండు పతకం, ఒక జత సాధారణ...