GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 5:57 am Digital Edition : GURU SWAMY

శ్రీ చౌడేశ్వరమ్మ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి ఆహ్వానం

పలమనేరు, ఆగస్టు 10 ( గరుడ ధాత్రి ) : పలమనేరు నియోజకవర్గం,గంగవరం మండలం పరిధిలోని ఎద్దుల చెరువు కట్ట మొరవ వద్ద ఉన్న చౌడేశ్వరమ్మ ఆలయంలో రేపు 12వ తేది బుధవారం శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరమ్మ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శ్రీ చౌడేశ్వరమ్మ భక్తమండలి మరియు వన్నియకుల క్షత్రియ కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో ముమ్మరంగా చేస్తున్నారు. ఈ వేడుకలకు విచ్చేయాల్సిందిగా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసన్, జేసీబీ నటరాజ, విజయ్ శేఖర్, వివిబి వెంకటాచలపతి, అర్ముగం తదితరులు పాల్గొన్నారు