శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు – కడ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్
కుప్పం, ఆగస్టు 04(గరుడ స్హాత్రి న్యూస్): కుప్పం లోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణానికి సంబంధించి ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానళ్లు, టెలివిజన్ మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కడా) ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ స్పష్టం చేశారు.మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,గంగమ్మ ఆలయ అభివృద్ధి అంశంపై సోమవారం సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, రాష్ట్రస్థాయి అధికారులతో సాధారణ సమీక్ష...