శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం

* రూ.5.73 కోట్ల పనులకు శంకుస్థాపన. * పాల్గొన్న టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, టిటిడి జెఈఓ ఏ. శరత్, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు సభ్యులు. కుప్పం,సెప్టెంబర్ 28 (గరుడ ధాత్రి ప్రత్యేక ప్రతినిధి): అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామి ఆలయ అభివృద్ధి పనులకు టీటీడీ పాలకవర్గ చైర్మన్ బి.ఆర్. నాయుడు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమం సోమవారం వాల్మీకిపురంలో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, టిడిపి నియోజకవర్గ...