శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రదోష పూజలు
నాగలాపురం, ఏప్రిల్ 29, (గరుడధాత్రి న్యూస్)
శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పళ్లికొండేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రదోష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రదోషం సందర్భంగా శ్రీ నందీశ్వర స్వామి వారికి, శ్రీ వాల్మీకేశ్వర స్వామి వారికి ఏకకాలంలో ప్రదోష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అభిషేకం అనంతరం స్వామి అమ్మవార్లను మరియు ప్రదోష నందీశ్వర స్వామి వారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి ధూప దీప నైవేద్యములు, మహా దీపారాధనలు నిర్వహించారు. ఈ ప్రదోష పూజలకు ప్రసాదం వినియోగం కొరకు నిండ్రకు చెందిన శ్రీనివాస్ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఉభయదారులుగా వ్యవహారించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ మంత్రి సీవీ.షణ్ముగం, ఆలయ పాలకమండలి సభ్యులు కె .శ్రీనివాసులు, ఎస్.క్రిష్ణయ్య, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.