శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రదోష పూజలు
శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రదోష పూజలు నాగలాపురం, ఏప్రిల్ 29, (గరుడధాత్రి న్యూస్) శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పళ్లికొండేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రదోష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రదోషం సందర్భంగా శ్రీ నందీశ్వర స్వామి వారికి, శ్రీ వాల్మీకేశ్వర స్వామి వారికి ఏకకాలంలో ప్రదోష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అభిషేకం అనంతరం స్వామి అమ్మవార్లను మరియు ప్రదోష నందీశ్వర స్వామి వారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి ధూప దీప నైవేద్యములు, మహా దీపారాధనలు నిర్వహించారు....