GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 6:54 pm Digital Edition : GURU SWAMY

శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం మాడవీధులలో భక్తుల సౌకర్యార్థం కూలింగ్ పెయింట్

మండలంలోని సురుటపల్లి గ్రామంలో వెలసియుండు శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంకు ప్రతిరోజు స్వామి అమ్మవార్ల దర్శనం కొరకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయుచున్నారు. అయితే వేసవికాలం వలన ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో భక్తులు పార్కింగ్ స్థలం నుంచి గోపురం వద్దకు విచ్చేయ సమయంలో అలాగే దర్శనం అయిన తదుపరి అన్నదానం భవనంకు మాడ వీధుల మీదుగా వెళ్ళు సమయంలో కాళ్లు కాలుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గమనించిన ఆలయ చైర్మన్ డి. పద్మనాభ రాజు కార్యనిర్వహణాధికారిణి పి. లత, పాలకమండలి సభ్యులు చర్చించి మాడ వీధులలో కూలింగ్ పెయింట్ వేయించారు. పాదరక్షకులు లేకుండా దేవస్థానమునకు వెళ్ళు సమయంలో భక్తులకు కాళ్లు కాలకుండా మాడవీధులలో కూలింగ్ పెయింట్ ఏర్పాట్లు పట్ల అటు భక్తులు, ఇటు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఫోటో : ఎన్ జీ పి 01. మాడవీధులలో కూలింగ్ పెయింట్ ఏర్పాట్లును పరిశీలిస్తున్న ఆలయ చైర్మన్